అల్లూరు: గేదెను ఢీ కొట్టి వ్యక్తి మృతి

గేదెను ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా ఆదివారం తెలిసింది. అల్లూరు మండలంలోని నార్త్ ఆములూరు సమీపంలో శనివారం ఒక ప్రమాదం జరిగింది. ఎస్సై కిషోర్ కుమార్ కథనం ప్రకారం కావలిలోని పాతూరుకు చెందిన కాలేశా(25) నార్త్ ఆములూరులో పెళ్లికి వచ్చి తిరిగి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గేదెను ఢీకొట్టాడు. గాయాలైన అతన్ని కావలి ఆసుపత్రికి తీసుకుపోగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్