నెల్లూరులో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నెల్లూరులోని మినీ టౌనుహాలులో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు, మన్యం ప్రజల కోసం బ్రిటీష్ వారిని ఎదిరించిన అల్లూరి వీరగాథను, ఆయన త్యాగనిరతిని కొనియాడారు. సామాన్యుల కోసం అల్లూరి స్వచ్ఛందంగా లొంగిపోయిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ మహావీరుని స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్