కావలి పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు వైద్య సేవలు బందు చేస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనకు నిరసనగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. క్యాండిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.