దుత్తలూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జి. సుభాషిణి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జి. సుభాషిణి నూతన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్సైగా పనిచేసిన ఆదిలక్ష్మి బదిలీ కావడంతో, ఆ స్థానంలో సుభాషిణి నియమితులయ్యారు. స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆమె సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన సుభాషిణికి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్