కావలి పట్టణ పరిధిలోని మద్దూరు పాడు ఆర్కే డాబా వద్ద సోమవారం స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ పై ప్రయాణిస్తున్న కృపాకర్, బాలిక మైథిలికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మైథిలి మృతి చెందింది. వీరిది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామంగా గుర్తించారు. మృతురాలు పదో తరగతి చదువుతుంది. ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.