కావలి: ప్రతి ఒక్కరు యోగా చేయడం మంచిది: ఎమ్మెల్యే

కావలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సత్యాన్వేషణ యోగాలయాన్ని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. యోగా క్లాసులు ప్రతిరోజు ఉదయం 6:15 నుంచి 7:15 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా చేయడం మానవ జీవితానికి ఎంతో అవసరం అన్నారు. యోగా చేయడం వలన శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్