జలదంకి: చికెన్ కోసం వెళ్లి మృత్యువు ఒడిలోకి

చికెన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. జలదంకి మండలం జమ్మలపాలెం బీసీ కాలనీకి చెందిన తాపీ మేస్త్రి తన్నీరు మాల్యాద్రి(50) ఆదివారం చికెన్ తెచ్చుకుందామని స్కూటీపై కావలికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో కళ్యాణ మండపం వద్ద ఓ కారు రివర్స్ చేస్తూ స్కూటీని ఢీకొట్టింది. కావలి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు వివరించారు.

సంబంధిత పోస్ట్