కావలి: పట్టపగలు 20 సవర్ల బంగారం చోరీ

కావలి పట్టణ శివారులో బుధవారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తుమ్మలపెంట రహదారికి ఆనుకొని ఉన్న స్థిరాస్తి క్షేత్రంలోని ఉపాధ్యాయిని అంజనీదేవి ఇంట్లో బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించారు. వీరు పాఠశాలలో విధులకు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్