కావలి: ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం.. భారీ నష్టం

నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు 15వ వార్డులో ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. జనరేటర్ ల రిపేర్ వర్క్ చేసుకునే దాసరి వెంకట నరసయ్య నివాసంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. సుమారు 17 సవర్ల బంగారం 6 లక్షల నగదు గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్