కావలి సబ్ జైలులో ఉన్న విలేకరులను కావలి రెండో పట్టణ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2020లో అమృత్ పైలాన్ ధ్వంసం కేసు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో 12 మందికి పై కేసులు నమోదు అవ్వగా, నలుగురు విలేకరులను అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఈ కేసులోనే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రిమాండ్ లో ఉన్న వారి నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు కస్టడీకి తీసుకున్నారు.