కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని 8వ వార్డు కొత్త బజార్లో ఇంటింటికి ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయానికి ఆయన వార్డుకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఓ హోటల్‌లో స్వయంగా ఎమ్మెల్యేనే దోసెలు వేసి అక్కడికి వచ్చిన వారికి అందజేశారు. వారితో సరదాగా మాట్లాడుతూ అందరి మొహాల్లో చిరునవ్వులు పూయించారు.