కావలిలోని గాయత్రీ నగర్‌లోని ఓ ఇంట్లో అర్పిత బిస్వాస్ (24) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికులు వివరాల మేరకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ ఏడాది క్రితం నుంచి కావలిలో ఓ క్లినిక్ నడుపుతోంది. అక్కడే పనిచేసే యువకుడు ఆమె హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.