నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీ నేత, మాజీ ఏఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి లేఖ విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పాల్పడుతున్న కారణంగా సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు, వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.