శ్రీ వెంగమాంబ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

ఉదయగిరి నియోజకవర్గంలో జరగనున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు కళ్యాణ మహోత్సవానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను ఆలయ ధర్మకర్త వేమూరి ముసలయ్య మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. బుధవారం జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులను ఆశీర్వదించాలని కోరుతూ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామినేని వెంగయ్య, పచ్చ వెంగయ్య, మల్లంపాటి నడిపి వెంగయ్యతో పాటు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్