నెల్లూరు జిల్లా, ఉదయగిరి, కావలి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా జరిగింది. నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ స్వయంగా పాల్గొని, లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనల మేరకు ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వృద్ధులు, వితంతువుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.