కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు మొగల్ రహీం బేగం (వైసీపీ మైనారిటీ పట్టణ మాజీ అధ్యక్షులు), మొగల్ షమ్మా రహీం (మాజీ మునిసిపల్ కో-ఆప్షన్ మెంబర్), షేక్ పీర్ మొహమ్మద్ (రూరల్ మండల మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు), షేక్ ఫర్వీన్ జాని (మాజీ జిల్లా మహిళా కమిటీ నాయకురాలు) బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి వారికి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.