దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఆవరణలోని నందీశ్వరుని విగ్రహానికి గురువారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహకులు బుధవారం తెలియజేశారు. సాయంత్రం ఏడు గంటలకు నందీశ్వరునికి ప్రదోషకాల విశేష అభిషేకం, అనంతరం చండ ప్రదక్షణలు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు విచ్చేసి దర్శించుకోవాలని కోరారు.