యువతకు క్రీడలే ఉత్తమ వేదిక: ఎమ్మెల్యే దగుమాటి

కావలి మండలం రామచంద్రపురంలో జరుగుతున్న రామచంద్రపురం ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని, గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి టోర్నీలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్