కావలిలో నాలుగు చోట్ల చోరీలు

కావలిలో వరుస చోరీలు జరగడం ఒక్కసారిగా పట్టణ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కావలి పట్టణంలోని రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోరీలు వెలుగు చూశాయి. పట్టణంలోని వెంగళరావునగర్, జనతా పేటలో నాలుగు చోట్ల చోరీలు జరిగాయి. చోరీల గురించి సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీధర్ అక్కడకు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు. ఈ చోరీల గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్