కావలిలో కుండపోత వర్షం

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని కుండపోత వర్షం కురిసింది. సుమారు అరగంటసేపు భీకర వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో చిరు వ్యాపారస్తులు, ప్రయాణికులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదురకోవాల్సి వచ్చింది. విపరీతంగా కాస్తున్న ఎండల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్