కావలి మండలం కొత్త సత్రం రెడ్డిపాలెంలో పిడుగుపాటుకు 11 గొర్రెలు మృతి చెందాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నక్క రామచంద్రయ్య తన గొర్రెలను పొలాల్లో మేతకు తీసుకెళ్లారు. ఒక్కసారిగా మెరుపుతో గొర్రెలు ఉన్న ప్రాంతంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే 11 గొర్రెలు మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎర్రబట్ట గొర్రెలు కావడంతో మార్కెట్లో జత రూ. 60,000 పలుకుతుందని భారీగా నష్టం జరిగిందని రైతు వాపోయాడు.