బుచ్చిరెడ్డిపాలెం: రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్మికులకు తీవ్ర గాయాలు

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో రాఘవరెడ్డి కాలనీ వద్ద ముంబై జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.  పంచాయతీ ట్రాక్టర్ ను ఓ లారీ వచ్చి వేగంగా ఢీకొంది. దీంతో అక్కడే ఉన్న పలువురు పంచాయతీ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిక తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పారిపోతున్న లారీని పట్టుకొని పోలీసులకు అప్ప చెప్పారు.

సంబంధిత పోస్ట్