బుచ్చి నగర పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న ముగ్గురు కూలీలను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బుచ్చిలో మంగళవారం వేకువ జామున పారిశుద్ధ్య పనులు చేస్తున్న కూలీలను డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దశయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి తల వద్ద గాయాలయ్యాయి. వారిని నెల్లూరులోని నారాయణ వైద్యశాలకు తరలించారు. వీరిని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరామర్శించారు.