చేజర్ల: వృద్ధురాలిని ఢీ కొట్టిన ట్రాలీ ఆటో

చేజర్ల మండలంలోని ఆదురుపల్లిలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఓ ట్రాలీ ఆటో ఢీకొట్టిన ఘటన గురువారం జరిగింది. ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఆమె ఆటోకింద ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు ఆటోను పైకి లేపి ఆమెను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మహిళకు తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు చిత్తలూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మగా గుర్తించారు. ఆమె కూడలిలో పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంది.

సంబంధిత పోస్ట్