రోజు మద్యం తాగి వస్తున్నాడని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

రోజు మద్యం తాగి వస్తున్నాడని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందుకూరుపేట మండలం కొమరికలో శుక్రవారం జరిగింది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మందా నరేశ్ (40)ను భార్య రాజేశ్వరి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్ ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕