దెయ్యం.. కళ్లకి కనిపించదు. ఉందో.. లేదో.. కూడా నిర్ధారించడం కష్టం. నెల్లూరు జిల్లాలో జొన్నవాడ రోడ్డులో ట్రాన్స్ జెండర్ రూపంలో దెయ్యం తిరుగుతుందనే పుకార్లు జిల్లా మొత్తం వ్యాపించాయి. ఇటీవల ఓ యువకుడిపై దెయ్యం దాడికి పాల్పడిందని, నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే ఇది కేవలం పుకార్లు మాత్రమేనని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు.