రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. ఇబ్రహీంపట్నంలోని ఆర్‌కే కళాశాలలో చదువుతున్న గణేశ్, అతని స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా, వారి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నందిగామ పట్టణానికి చెందిన ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్