నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర డిమాండ్ చేశారు. శనివారం ఈ విషయమై ఆర్ఐఓ కార్యాలయంలో ఏవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఇంటర్ కాలేజీల్లో సాయంత్రం 7, 8 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తూ సమయపాలన లేకుండా విద్యార్థులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.