నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు వెడల్పు పనుల కారణంగా నేతాజీ నగర్, గౌతమి నగర్, ప్రగతి నగర్ పొదలకూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర విభాగం వారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.