నెల్లూరు బీవీ నగర్, కొండాయపాళెం, పడారుపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ ఎం. శ్రీధర్ తెలిపారు. దీంతో మాగుంట లేఅవుట్, మినీబైపాస్ రోడ్డు, లెక్చరర్స్ కాలనీ, కొండాయపాళెం, వనంతోపు, సప్తగిరి కాలనీ, ఆర్టీవో ఆఫీస్, పడారుపల్లి, కళ్యాణ్ నగర్ లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.