పెన్నా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

నెల్లూరు నగరంలోని పెన్నా నదిలో పాత బస్సు ఫ్లైఓవర్ వంతెన సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 45-50 ఏళ్ల వయసున్న మృతుడు బ్లూ జీన్స్, గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. అతని కుడి చేతిపై 'అమ్మ' అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్