నెల్లూరు నగరంలో యువకుడి దారుణ హత్య

నెల్లూరు నగరంలో శనివారం దారుణ హత్య చోటు చేసుకుంది. నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడ్ హౌస్ ప్రాంతానికి చెందిన కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిపై సస్పెక్ట్ రౌడీ షీటర్ నమోదై ఉంది. ఇటీవల ఏటి పండగ సందర్భంగా కొందరు యువకులతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్