నెల్లూరు నగరంలో ఇటీవల గంజాయి విక్రయాలు ఎక్కువయ్యాయి. వీటిపై నిఘా ఉంచిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు బుధవారం నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడుకు చెందిన ఎస్ ఏళ్ల వర్షన్, రాహుల్ దావకుమార్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 కేజీల గంజాయి, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి జడ్జి ఎదుట హాజరు పరిచినట్లు ఎస్సై మురళీకృష్ణ తెలిపారు.