మేయర్ పీఠంపై ఉత్కంఠ.. ఎస్సీ రిజర్వేషన్ తో కొత్త రాజకీయ చర్చ?

నెల్లూరు నగర మేయర్ పీఠంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్ స్థానం ఎస్సీ (SC) సామాజిక వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
2004 నుంచి నెల్లూరు మేయర్ స్థానం ఎస్సీ వర్గాలకు రిజర్వ్ కాలేదని, ఈసారి అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ అమలైతే కూటమిలో జనసేనకు మేయర్ అభ్యర్థిత్వం దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. జనసేనలో ప్రజల్లో గుర్తింపు, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆదరణ ఉన్న ఓ కీలక నేత పేరు కూడా వినిపిస్తున్నట్లు సమాచారం.
అయితే రిజర్వేషన్, అభ్యర్థి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕