వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కల్తీపై దాడులు నిర్వహించారు. పంబా యేసుదాసు అనే వ్యక్తి 20 మంది రైతుల నుంచి సేకరించిన పాలలో నూనె కలిపి ఫ్యాట్ కంటెంట్ పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో, రెండు క్యాన్లలో ఉన్న 60 లీటర్ల కల్తీ పాలను అధికారులు ధ్వంసం చేసి, శాంపిల్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. పాల కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.