మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైన సోషల్ మీడియా కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో మంగళవారం ఆయనను హాజరు పరిచారు. సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారన్న కారణంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. సిఐడి ప్రత్యేక న్యాయమూర్తి విచారించి 14 రోజులు పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో కాకాణిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొని వస్తున్నారు.