నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ నేత్రత్వంలో నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే పోలీసు సిబ్బంది, ఆర్ పి ఫ్, బి డి టీమ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నెల్లూరు రైల్వే స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒరిస్సా నుండి బెంగళూరు, చెన్నై వైపు నుండి వచ్చే రైళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.