నెల్లూరు: కత్తితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్

కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నెల్లూరు నగరానికి చెందిన కృష్ణ మూలాపేట రావి చెట్టు సెంటరులో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నారు. ఇరుకళల సంఘానికి చెందిన వేణు ఈ నెల 12వ తేదీ బైక్ రిపేరు చేయించుకునేందుకు వచ్చి మాట మాట పెరిగింది. వేణు కత్తితో కృష్ణపై దాడి చేయబోగా అక్కడే ఉన్న వెంకటేష్ అడ్డుకోవడంతో గాయాలయ్యాయి. చిన్నబజారు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్