మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన భాగంలో, గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా సెంటర్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జైలు దగ్గరకు వెళ్లాడు. అనంతరం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే దారిలో వేదపాలెం వద్ద వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భావోద్వేగంతో 'జై జగన్ జై జగన్' అని అరుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.