మహిళా కిడ్నాపర్ చెరలో నుంచి ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఇన్స్పెక్టర్ జీ. వేణుగోపాల్ రెడ్డి వివరాలు తెలిపారు. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నివసించే కృష్ణ, శీనమ్మ దంపతులకు కుమార్తె చంద్రమ్మ, కుమారుడు సూర్య సంతానం. ఈనెల 8న నెల్లూరు సెట్టిగుంట రోడ్డు వద్ద ఉండగా కావిలికి చెందిన బాలన్న అనే మహిళ ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళిందని తెలిపారు.