నెల్లూరు నగరం కిసాన్ నగర్ లో వెంకటరమణ, కృష్ణవేణి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల విభేదాల నేపథ్యంలో కృష్ణవేణి శనివారం ఆత్మహత్య చేసుకుంది. వెంకటరమణ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శనివారం దంపతుల నడుమ గొడవ జరిగింది. భర్త ఇంట్లోలేని సమయంలో కృష్ణవేణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవాబ్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.