తెలుగుదేశం పార్టీ నాయకులు మాతూరు శ్రీనివాసులు రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విడవలూరులోని ఆయన నివాసానికి చేరుకుని, భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దివంగత శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.