నెల్లూరు: పరీక్షలో ఉత్తీర్ణత కాలేదని విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్ లో ఉత్తీర్ణత కాలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ చింతారెడ్డిపాలెంనకు చెందిన విద్యార్థి నెల్లూరు నగరం రామలింగాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష ఫలితాల్లో ఒక సబ్జెక్టు తప్పాడు. మనస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్