నెల్లూరు: వందేభారత్ రైలులో సాంకేతిక లోపం

హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న వందే భారత్‌ రైలులో శుక్రవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రైలును నెల్లూరు రైల్వే స్టేషన్‌లో అత్యవసరంగా నిలిపారు. సమస్యను గుర్తించిన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఈ లోపంతో కొన్ని బోగీల్లో ఏసీలు, ఫ్యాన్లు పని చేయక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైలు అరగంటకు పైగా నిలిచినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్