నెల్లూరు నగరంలో మంగళవారం విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో కలిసి ములాపేట పోలీస్ క్వార్టర్లో ఉంటున్నారు. వీరికి 9 నెలల క్రితం వివాహమైంది. ఇంట్లోనే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయన మొదటి భార్య సైతం ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది. సిఐ కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.