నెల్లూరు ఈరగాళ్ళమ్మ సమీపంలోని రాజీవ్ గృహకల్పన అపార్ట్మెంట్ లో ఉంటున్న వేణుగోపాల్, లక్ష్మీదేవి నివాసం ఉంటున్నారు. ఈమె మాగుంట లేపుటలోని షాపింగ్ మాల్ లో పని చేస్తోంది. మంగళవారం మూడో అంతస్తు నుంచి చెత్త వేస్తుండగా ప్రమాదవశాత్తు జారీపడి బలమైన గాయమైంది. కుటుంబసభ్యులు 108కి సమాచారం ఇవ్వగా సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఘటన స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు.