నెల్లూరు: శ్యామ్ ఆధ్వర్యంలో శబరి శ్రీరామ క్షేత్రంలో పూజలు

నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో శుక్రవారం తెలుగు యువత రూరల్ అధ్యక్షుడు మందిపాటి శ్యామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 57 టెంకాయలను కొట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని శ్యామ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి 37వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనాథ్, దేవస్థాన సభ్యుడు నరేష్, మిద్దె శ్రీనాథ్, సాజిద్, గోపి, చిన్న, సుగుణ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్