సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులకు యువతకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో బుధవారం యువత పోరును నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.