నెల్లూరు నగరంలో బుధవారం ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకోవడం తో పాటు విపరీతమైన గాలులు వీస్తున్నాయి. రహదారుల పక్కన చిన్న చిన్న గుడిసెలు, గుడారాలు వేసుకున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. విపరీతమైన గాలులతో పాటు చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీలు చుట్టుకుని పోయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.