స్వర్ణ నంది అవార్డ్స్: సమాజ సేవకు రఘురాములుకు పురస్కారం

హైదరాబాద్‌లోని బి.ఎం. బిర్లా సైన్స్ సెంటర్ వేదికగా మెగా హెల్పింగ్ ఫౌండేషన్, మెగా ఈవెంట్స్ ఎండీ పి. శిరీషా రెడ్డి ఆధ్వర్యంలో 'స్వర్ణ నంది అవార్డ్స్ – 2026' ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు ధనరాజ్, శివ ప్రసాద్ యనాల, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన ప్యాక్స్ సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు గారికి శిరీషా రెడ్డి చేతుల మీదుగా 'స్వర్ణ నంది' పురస్కారం అందజేయబడింది. ఈ పురస్కారం అందుకున్న రఘురాములు గారికి అభినందనలు తెలుపుతూ, వారి సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్